చిత్రం వేసి.. భక్తిని చాటి..
దేవరకొండ : దేవరకొండ పట్టణానికి నిడమనూరి మళ్లీశ్వరి వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి తనకు స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంది. మళ్లీశ్వరికి బొమ్మలు వేయడం అలవాటు కావడంతో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవరకొండలోని గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో స్వామి వారి నిలువెత్తు చిత్రాన్ని వేసింది. సోమవారం రాత్రి స్వామివారి చిత్రాన్ని వేసేందుకు ఆమె సంకల్పించింది. వివిధ రంగులు, పుష్పాలు ఉపయోగించి సోమవారం రాత్రి 10గంటలకు ప్రారంభించి మంగళవారం ఉదయం 4 గంటలకు పూర్తి చేసింది. దేవాలయానికి వచ్చిన భక్తులు స్వామివారి చిత్రాన్ని చూసి సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.


