యూరియా కోసం అన్నదాతల బారులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం అన్నదాతల బారులు

Aug 24 2025 12:12 PM | Updated on Aug 24 2025 12:14 PM

నిడమనూరు : నిడమనూరు పీఏసీఎస్‌కు శనివారం 445 బస్తాలు (18 టన్నులు) యూరియా వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో యూరియా కోసం రైతులు సహకార సంఘం వద్దకు వచ్చారు. దీంతో ఎస్‌ఐ ఉప్పు సరేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పహారా నడుమ.. ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున 148 మంది రైతులకు యూరియా పంపిణీ చేశారు. సగంమంది రైతులు యూరియా తీసుకోకుండానే వెనుదిరాగారు. గతేడాది ఏడాది సహకార సంఘం ద్వారా 1100 టన్నుల యూరియా విక్రయించగా, ఈ ఏడాది 400 టన్నులే విక్రయించామని సీఈవో జానయ్య వెల్లడించారు. సోమవారం మరో రెండు లారీల యూరియా వస్తుందని ఏఈఒ విజయచంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement