
‘ప్రీప్రైమరీ’ 20 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సింది
ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
పెద్దవూర : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ ఇరవై ఏళ్ల క్రితమే తీసుకోవాల్సిన నిర్ణయమని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తమ ఎంఈఓ అవార్డు గ్రహీత తరి రాములు సన్మాన కార్యక్రమం శనివారం పెద్దవూర జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ యేడాది కొన్ని పాఠశాలల్లోనే ప్రీ పైమరీకి అనుమతిని ఇచ్చిందని.. అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి కేవలం ఉపాధ్యాయుల సమస్యలపైనే శాసనమండలిలో గళమెత్తుతానని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి, నాయకులు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి, ఇరుమాది పాపిరెడ్డి, దుర్గాప్రసాద్, దండ వీరారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, భిక్షంగౌడ్, రూపా, దేవేందర్, నామిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్‌సీరెడ్డి పాల్గొన్నారు.