
పోక్సో కేసు నమోదు
వివాహాన్ని ప్రోత్సహించిన బాలిక తల్లి,
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కూడా కేసు
సూర్యాపేటటౌన్: బాలికను నాల్గో వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై సూర్యాపేట రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శనివారం ఎస్‌ఐ బాలునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ పంచాయతీకి చెందిన బానోతు కృష్ణంరాజు నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న కృష్ణంరాజు 2023 డిసెంబర్‌లో సూర్యాపేట మండలంలోని సపావట్‌తండాకు చెందిన మైనర్ బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇటీవల అతడు ఐదో పెళ్లికి కూడా సిద్ధమవ్వగా.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ ఈ నెల 12న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే సపావట్‌తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూక్య నారాయణ వదిన కొడుకే కృష్ణంరాజు కాగా.. నారాయణ, బాలిక తల్లి కలిసి.. ఆమెను కృష్ణంరాజుకు ఇచ్చి వివాహం చేశారని బాలిక తండ్రి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు వివాహాన్ని ప్రోత్సహించిన బాలిక తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణపై చైల్డ్ మ్యారేజీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు.