నానో ఎరువు.. దిగుబడి మెరుగు | - | Sakshi
Sakshi News home page

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

Aug 23 2025 12:43 PM | Updated on Aug 23 2025 12:43 PM

నానో

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

నానో యూరియా వినియోగించే పద్ధతులు మొక్కల పెరుగుదల సమృద్ధిగా.. పంటలకు ఉపయోగం పంట దిగుబడి పెరుగుతుంది

● 500 ఎంఎల్‌ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు.

● 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్‌ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి.

● ఇతర పురుగు మందుల కలిపి పిచికారీ చేసుకోవద్దు. అవసరమైతే వ్యవసాయ అధికారులు, శాస్త్రవ్తేతల సూచనలు పాటించాలి.

● గుళికల రూపంలో ఉండే యూరియాతో పోల్చుకుంటే నానో యూరియా ఉపయోగించడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు.

● సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది.

● పంటలపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూరియాను పిచికారీ చేయడంతో దిగుబడులు పెరుగుతాయి.

● యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు.

రెండు సంవత్సరాలుగా నానో యూరియా, డీఏపీ వాడుతున్నాను. 24 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాను. ప్రస్తుత మార్కెట్‌లో ఎరువుల బస్తాల కొరత ఏర్పడింది. దానికి ప్రత్యామ్నాంగా నానో ఎరువు వాడుతున్నాను. నానో ఎరువు వల్ల మొక్కల పెరుగుదల సమృద్ధిగా ఉంది.

– బొడ్డుపల్లి చంద్రశేఖర్‌, ఖాజీరామారం, నల్లగొండ మండలం

నానో యూరియా కణాలు చిన్నవిగా ఉండడంతో పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా చేరుతుంది. ఈ యూరియా ద్రవరూపంలో ఉండడంతో ఆకులపై పిచికారీ చేసినప్పుడు రంధ్రాల ద్వారా సులభంగా లోనకు వెళ్తూ మొక్క అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది.

– శ్రీనివాస్‌, ఏఓ నల్లగొండ మండలం

నానో యూరియా అందుబాటులో ఉంది. వరి పంటకు నానో యూరియాను డ్రోన్‌ సహాయంతో కూడా పిచికారీ చేసుకోవచ్చు. నానో యూరియా లీటర్‌ నీటికి 3.2 ఎంఎల్‌ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

– పార్వతి చౌహన్‌, ఏఓ త్రిపురారం మండలం

రామగిరి(నల్లగొండ), త్రిపురారం : వ్యవసాయ రంగంలో నానో ఎరువు మెరుగైన ఫలితాలనిస్తూ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుంది. ఇది ద్రవరూపంలో ఉండే ఎరువు. మార్కెట్‌లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరియాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్‌ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవ రూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు పంట దిగుబడిని పెంచి, పర్యావరణానికి మేలు చేస్తుంది.

నానో యూరియా లక్షణాలు

ఇది నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన యూరియా. దీనిలో నత్రజని కణాలు చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. సంప్రదాయంగా వాడే యూరియాతో పోల్చితే దీని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండి మొక్కలు నత్రజనిని త్వరగా గ్రహిస్తాయి. ఒక బస్తా యూరియాకు సమానమైన ఫలితాన్ని అర లీడర్‌ నానో యూరియా అందిస్తుంది. ద్రవ రూపంలో ఉండటం వల్ల మొక్కలకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది. సాధారణంగా వాడే యూరియా నేలలోకి వెళ్లడం వల్ల భూమికి కాలుష్యం కలుగుతుంది. ద్రవ రూపంలోఉంటే నానో యూరియా నేరుగా మొక్క ఉపరితలాన్ని చేరుతుంది తద్వారా భూగర్భజల కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

సాంకేతిక వ్యవసాయానికి సూచిక..

సాంకేతిక వ్యవసాయానికి నానో యూరియా ఒక సూచిక అని చెప్పవచ్చు. అన్ని రకాల పంటల దిగుబడితో పాటు రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది. నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడమే కాకుండా దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరియాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు.

ధరలు ఇలా..

నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. నానో యూరియా ఒక్క బాటిల్‌ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్‌ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్‌ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది.

ద్రవరూపంలోయూరియా, డీఏపీ

ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా..

ఫ పంటలకు అధిక నత్రజనిని అందిస్తున్న ‘నానో’

ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి

ఫ రవాణా, నిల్వ చేయడం తేలిక అంటున్న వ్యవసాయాధికారులు

నానో ఎరువు.. దిగుబడి మెరుగు1
1/4

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

నానో ఎరువు.. దిగుబడి మెరుగు2
2/4

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

నానో ఎరువు.. దిగుబడి మెరుగు3
3/4

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

నానో ఎరువు.. దిగుబడి మెరుగు4
4/4

నానో ఎరువు.. దిగుబడి మెరుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement