
పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
నల్లగొండ: పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది పనితీరును సీఐ రాజశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులు, రిసెప్షన్ మేనేజిమెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్‌హెచ్‌ఓ రూమ్ తదితర ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు అలసత్వం వహించకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరాలు, దొంగతనాల నివారణకు స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్‌బీ సీఐ రాము, ఎస్‌ఐ లు గోపాల్ రావు, సైదులు, సతీష్ ఉన్నారు.
మానవ అక్రమ రవాణాను అడ్డుకుందాం
నల్లగొండ: మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడం అందరి బాధ్యత అని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనపై శుక్రవారం నల్లగొండలోని డైట్ కాలేజీలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోజూ ఎంతో మంది బాలికలు, మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిపారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ రామచంద్రయ్య మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ డాక్టర్ సునిత కృష్ణన్ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ, పోలీస్, విద్య, న్యాయ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు 29,200 మంది అమ్మాయిలు, మహిళలను కాపాడి వారికి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. మోసానికి గురైన వారు 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
డిండి: సీజనల్ వ్యాధులతో ప్రజలు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. డిండి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కుక్క, పాము కాటుకు సంబంధించిన మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్రైడే సందర్భంగా డీఎన్‌టీ కాలనీలో నిర్వహించిన సదస్సులో దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవి, వైద్యాధికారులు శైలి, హరికృష్ణ, సిబ్బంది ఉన్నారు.
ఇరిగేషన్ ఎస్‌ఈగా భద్రునాయక్
నల్లగొండ: నల్లగొండ ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ (ఫుల్ అదనపు చార్జి)గా ధారావత్ భద్రునాయక్ శుక్రవారం నల్లగొండలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది ఆయనకు పూలబొకే అందజేసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రాజారత్నం, ఇతర సిబ్బంది ఉన్నారు.

పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి