
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
మునుగోడు: రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇళ్లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ డి.రవీందర్‌రావు అన్నారు. ఉపాధిహామీ పథకం పనుల జాతర కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి నిధులు వినియోగించుకోవాలన్నారు. ఇంకుడు గుంత నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఇళ్లతోపాటు మురుగు కాల్వల ఎండింగ్, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో విధిగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్ కార్యాలయయంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డీపీఓ వెంకయ్య, అదనపు పీడీ నవీన్, ఎంపీడీఓ యుగేంధర్‌రెడ్డి, ఎంపీఓ పర్వేజ్ అత్తర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ రవీందర్‌రావు