
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత : ఎస్పీ
నార్కట్‌పల్లి : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శనివారం నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ‘మిషన్ త్రిబుల్‌ఆర్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే.. నార్కట్‌పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి, కామినేని ఆస్పత్రి, ఏపీ లింగోటం, గోపాలయపల్లి ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్, రంబుల్ స్టిక్స్, సెంట్రల్ లైటింగ్, కాన్వేజ్ సేఫ్టీ మిర్రర్ వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతి, రిటైర్డ్ సీఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.