నేను ఎవరినీ కించపరచలేదు : కలెక్టర్
నల్లగొండ : ప్రజావాణి సందర్భంగా తాను ఎవరినీ కులం, మతం పేరుతో కించపరచలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్ యుద్ధ సంఘటనకు సంబంధించి జిల్లాలోని కొంతమంది ఉలేమాలు తనకు దరఖాస్తును ఇచ్చారని, ఆ సందర్భంలో వారికి సంబంధం లేని హైదరాబాద్‌కు చెందిన దేవి అనే మహిళ కలెక్టర్‌ను ‘నువ్వు.. నువ్వు’ అని సంబోధించిందని.. జిల్లా అధికారులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. అయినప్పటికీ తాను ఆమెకు సముచితంగా సమాధానం చెప్పి పంపామని తెలిపారు. 18వ తేదీన ప్రజావాణిలో ఉలేమాలను తాను కించపరిచాననడం నిజం కాదని కలెక్టర్ పేర్కొన్నారు.
మహిళలపై దాడులను అరికట్టడంలో విఫలం
తిప్పర్తి : మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్యా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం తిప్పర్తి సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ఐద్వ జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళలను వంటింటికి పరిమితం చేస్తూ.. అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం లేదన్నారు. మహిళలను చైతన్యం చేసేందుకు ఐద్వా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి, అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి, అనురాధ, పద్మ, నాగమణి, గోవర్దన, సుల్తానా, ధనలక్ష్మి, జంజరాల ఉమ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు విరివిగా పెంచాలి
నల్లగొండ : మొక్కలను విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో సామాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా కానిస్టేబుళ్లకు కరాటే శిక్షణ
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలోని 14 పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు స్పెల్ప్ డిఫెన్స్‌లో భాగంగా మంగళవారం కరాటే శిక్షణ ఇచ్చారు. మిర్యాగులగూలోని ఎన్పెస్పీ క్యాంపు గ్రౌండ్‌లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని డీఎస్పీ కె.రాజశేఖరరాజు ప్రారంభించి మాట్లాడారు. మహిళా కానిస్టేబుళ్లకు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు మోతీరామ్, సోమనర్సయ్య, పీఎన్‌డీ ప్రసాద్, కరాటే కోచ్ శ్రీధర్, ఎస్‌ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో తనిఖీలు
చిట్యాల : వ్యవసాయానికి ఉపయోగించే యూరియా, ఎరువులు పక్కదారి పడుతున్న నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో, నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లిలోని ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలను మంగళవారం జిల్లా పరిశ్రమలశాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆ పరిశ్రమలో వాడుతున్న రసాయన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సతీష్, నకిరేకల్ ఏడీఏ జానీమీయా మాట్లాడుతూ యూరియాను, ఎరువులను పరిశ్రమల్లో వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ గిరిబాబు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
నేను ఎవరినీ కించపరచలేదు : కలెక్టర్
నేను ఎవరినీ కించపరచలేదు : కలెక్టర్


