మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద రాక కొనసాగుతోంది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు ఎగువ ప్రాంతాల నుండి మూసీకి 13,294 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 643 అడుగుల (3.94 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టులో నాలుగు క్రస్ట్‌గేట్లను మూడు అడుగులు, మరో నాలుగు క్రస్ట్‌గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 12,270 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 94 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


