సంపదను దోచుకుంటున్న పాలకులు
మిర్యాలగూడ : దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టేందుకు కార్పొరేట్లు, ఓట్లను పాలకులు దోచుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం తప్పుడు మార్గాలు అనుసరిస్తోందని విమర్శించారు. బిహార్‌లో బీజేపీకి ఓటు వేయని 65 లక్షల ఓట్లను తొలగించారని ధ్వజమెత్తారు. స్వతంత్య్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిపోయిందన్నారు. కేంద్ర,. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. తెలంగాణాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్షతను చూపుతోందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, శశిధర్‌రెడ్డి, రెమడాల పరుశురాములు, తిరుపతి రామ్మూర్తి, కరీం, నాగేశ్వర్‌రావునాయక్, రామారావు, ఉన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి


