
అమ్మా.. మా మొర ఆలకించరూ..
నల్లగొండ: నల్లగొండ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణికి పలు మండలాల నుంచి బాధితులు వచ్చి వివిధ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలువురిని నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కొందరు మా మొర ఆలకించి మమ్ములను ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.
అమ్మా నాన్న లేరు.. ఆదుకోండి
మాకు అమ్మా నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి నన్ను, నా సోదరుడి కార్తిక్‌ను నానమ్మ బోడమ్మ కూలిపని చేసి పోషిస్తుంది. మా తాత కూడా చనిపోయాడు. నానమ్మే మాకు ఆధారం. తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. నాకు ఆరేళ్ల క్రితమే నరాల వ్యాధితో కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. నాకు పెన్షన్ రావడం లేదు. వికలాంగుల పింఛన్ విప్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – రక్షిత, దివ్యాంగురాలు,
పజ్జూర్, తిప్పర్తి మండలం
నా కాళ్లు చచ్చుపడిపోయాయి. ఎక్కడికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. నా వెంట మరో మనిషి లేకుండా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉంటూనే కుండలు తయారు చేస్తాను. నాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాపై దయదలిచి నాకు చార్జింగ్ ట్రైసైకిల్ ఇప్పించి ఆదుకోవాలి.
– ఎర్రజెల్ల నాగమ్మ, చండూరు
ఫ ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్న బాధితులు

అమ్మా.. మా మొర ఆలకించరూ..

అమ్మా.. మా మొర ఆలకించరూ..