
అమరవీరుల స్ఫూర్తితోనే ప్రజాపాలన
శాలిగౌరారం : అమరవీరుల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని ఏఐసీసీ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో నాడు రజాకార్ల చేతిలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తన సొంత ఖర్చులతో నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కేంద్రబింధువు అన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు దండ అశోక్‌రెడ్డి, గూని వెంకటయ్య, మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్, మాజీ ఎంపీటీసీ నోముల జనార్థన్, భూపతి వెంకటేశ్వర్లు, రామలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.