ఇన్నోవేషన్‌ హబ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్‌ హబ్‌

Aug 8 2025 9:03 AM | Updated on Aug 8 2025 9:03 AM

ఇన్నో

ఇన్నోవేషన్‌ హబ్‌

..మనకేనా?

స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా..

రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్‌లకు సహకారం అందించడం, ఫండింగ్‌, మార్కెట్‌ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది.

దక్షిణ తెలంగాణలో రీజనల్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖత

యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు

పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లో ఎంపీ రఘువీర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ లేదా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్‌ హబ్‌ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్‌ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రాంతీయ స్థాయిలో

ఆవిష్కరణలకు ప్రోత్సాహం

వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లను/సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్‌ హబ్‌లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్‌ హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్‌ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు.

ప్రాంతీయ అవసరాలపైనా ప్రాజెక్టులు

రీజనల్‌ హబ్‌లో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించి అమలు చే యనుంది. తద్వారా స్థానిక అవసరాలకు పెద్దపీట వేయనుంది. స్థానిక యువత, విద్యార్థులు, పరిశోధకులకు ప్రోత్సాహం అందించనుంది. స్టార్టప్‌లకు ప్రోత్సాహంతో కొత్త సంస్థలు ఏర్పడటం ద్వారా వాటిల్లోనూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఆధునిక సాంకేతికతపైనా ప్రత్యేక దృష్టి

రీజనల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌లో నూతన ఆవిష్కరణలతో పాటు స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంపైనా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. అందులో ఏర్పాటు చేసే నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా డిజిటల్‌ స్కిల్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలీజెన్స్‌ అండ్‌ మిషన్‌ లర్నింగ్‌, డాటా సైన్స్‌, ఫ్యాబ్రికేషన్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి ప్రదర్శన కేంద్రాలు (ప్రోటోటైపింగ్‌), చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తుల పరీక్ష వేదికలను ఏర్పాటు చేయనుంది. అలాగే వృత్తి శిక్షణ కేంద్రాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెంటర్లు, వర్చువల్‌ లాబ్స్‌ – టెక్‌ లాబ్‌లు, ఇండస్ట్రీ, అకాడమీ కొలాబ్రేషన్‌ కేంద్రాలను ఇందులో ఏర్పాటు చేయనుంది.

ఇన్నోవేషన్‌ హబ్‌1
1/1

ఇన్నోవేషన్‌ హబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement