వేసవి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు
నల్లగొండ టూటౌన్ : వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో 500 మంది విద్యార్థులు పాల్గొని వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను మెరుగు పరిచే దిశగా క్రీడల శాఖ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఆర్డీఓ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి విమల, కోచ్‌లు నాగార్జున, నగేష్, శ్రీధర్, పవన్, శ్రీనివాసులు, సైదులు, అంబటి ప్రణీత్, ప్రేమ్, లోకేష్, లింగయ్య, సునీత, దాసు, నాగార్జున, ప్రకాష్‌నారాయణ, నజీరుద్దీన్ పాల్గొన్నారు.
వేసవి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు


