పేదల కడుపునింపేందుకు సన్న బియ్యం
చిట్యాల : పేదల కడుపునింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని పట్ల జనార్దన్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని మంగళవారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి తిన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ఆతీతంగా అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఎస్‌డీఎఫ్ నిధులు ఆరు కోట్లతో లింకురోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, సుంకరి వెంకన్నగౌడ్, పల్లపు బద్దుడు, జన్నపాల శ్రీను, ఎద్దులపురి క్రిష్ణ, జడల చినమల్లయ్య, మందుగుల సైదులు తదితరులు పాల్గొన్నారు.


