● అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన భర్త
మిర్యాలగూడ టౌన్: మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మ య్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం అవంతీపురం గ్రామానికి చెందిన పర్వతం రమణ నిత్యం మద్యం తాగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వెళ్లడంతో.. మద్యం ఎందుకు తాగి వచ్చావు అంటూ భార్య యశోద నిలదీసింది. దీంతో మనస్తాపానికి గురైన రమణ అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రమణ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య యశోద ఈ నెల 21వ తేదీన మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెద్దఅడిశర్లపల్లి: భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నేతాల సత్తయ్య(48) ఈ నెల 11వ తేదీన భూతగాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
గుర్రంపోడు: ఆర్థిక ఇబ్బందులతో గడ్డిమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంలో జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. వద్దిరెడ్డిగూడేనికి చెందిన మేకల నాగిరెడ్డి(39) తనకున్న 9ఎకరాల భూమిలో బత్తాయి తోటతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నాగిరెడ్డి ఆదివారం పొలం వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య మేకల సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భార్య మందలించిందని మనస్తాపంతో..