టెన్త్‌ పరీక్షకు 158 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షకు 158 మంది గైర్హాజరు

Mar 25 2025 2:25 AM | Updated on Mar 25 2025 2:20 AM

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 158 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సోమవారం జరిగిన ఆంగ్లం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,679 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,521 మంది హాజరయ్యారు. 158 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

28న రైతు సత్యాగ్రహం

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని కలెక్టరేట్‌ ఎదుట ఈ నెల 28న రైతు సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం వెంకట్‌రెడ్డి, గుడుగుంట్ల సాయన్నగౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడంతో పాటు దొడ్డు ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా, ఎండిన పొలాలకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సత్యగ్రహం చేపడుతున్నట్లు తెలిపారు.

సాగర్‌ ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందం

నాగార్జునసాగర్‌ : సాగర్‌ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సోమవారం కాయకల్ప బృందం పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా, ఏరియా ఆస్పత్రులను ఈ బృందం ఏటా పరిశీలిస్తుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణ, పరిసరాలు, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి నివేదికలను ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తుంది. నివేదికల ఆధారంగా ప్రమాణాలు పాటిస్తూ వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తారు. అందులో భాగంగా కొల్లాపూర్‌ ఏరియా ఆస్పత్రి డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఒక బృందం సాగర్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించి పరిశీలించింది. వీరితో పాటు స్థానిక కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హరికృష్ణ, వైద్య బృందం, నర్సింగ్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

నెల్వలపల్లి హెచ్‌ఎం సస్పెన్షన్‌

చింతపల్లి : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోసాధ్యాయుడిని విధుల తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి మండల పరిధిలోని నెల్వలపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వేణుగోపాలు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళా ఉపాధ్యాయులను మానసిక వేధించడం, పాఠశాల నిబంధనలు పాటించకపోవడం, రికార్డులు సరిగా నిర్వహించడం లేదు. దీనిపై మండల విద్యాధికారి అంజయ్య అధికారులకు నివేదిక అందజేయడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు.

క్షయ రహిత జిల్లాగా మారుద్దాం

నల్లగొండ టౌన్‌ : క్షయ రహిత జిల్లా కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్‌జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీపై ప్రజల్లో విరివిగా అవగాహన కలిగించాలన్నారు. టీబీ లక్షణాలుంటే జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్‌లో పరీక్షలు చేయించుకుని సక్రమంగా మందులను వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. అనంతరం జిల్లా క్షయ నివారణ కేంద్రం రివర్‌నిమ్స్‌ ఆస్పత్రి సంయుక్తంగా జిల్లాస్థాయిలో విద్యార్థులు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్‌ కాలేజి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.వాణిశ్రీ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణకుమారి, డాక్టర్‌ దామెర యాదయ్య, డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కేస రవి, అరుంధతి, బ్లెస్సీ, ఇస్తార్‌, రవిప్రసాద్‌, హరికృష్ణ, రమేష్‌, రాఘవేందర్‌రెడ్డి, నాగిల్ల మురళి, కళ్యాణ చక్రవర్తి, నర్సింగ్‌ కాలేజి విద్యార్థినులు పాల్గొన్నారు.

టెన్త్‌ పరీక్షకు 158 మంది గైర్హాజరు1
1/1

టెన్త్‌ పరీక్షకు 158 మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement