ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Sep 23 2024 2:50 AM | Updated on Sep 23 2024 2:50 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మిర్యాలగూడ టౌన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని బంజార ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ మాలోతు దశరథనాయక్‌ కోరారు. ఆదివారం మిర్యాలగూడలోనితెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని వాటిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై ఎలాంటి షరతులు లేకుండా కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేలా ఆదేశాలను జారీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన రెవెన్యూ, పంచాయతీరాజ్‌ ఉద్యోగులను తిరిగి పూర్వ స్థానాలకు పంపాలన్నారు. అన్నీ శాఖలలో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు గోపినాయక్‌, జంలానాయక్‌, సైదానాయక్‌, లాలునాయక్‌, మక్లానాయక్‌, రమేష్‌నాయక్‌, శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ బంజార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ మాలోతు దశరథనాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement