నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో 1–5 తరగతుల విద్యార్థుల్లో పునాది స్థాయి అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణ ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు ఇన్‌చార్జి కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో మాట్లాడారు. 2–5 తరగతుల విద్యార్థుల కోసం రోజువారీ పాఠ్య ప్రణాళికలు, నెలవారీ ఫోకస్ కాంపిటెన్సీలు, ఎగ్జిట్ స్లిప్ మూల్యాంకనాలను అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన చోట ఎన్‌రిచ్‌మెంట్, రెమిడియేషన్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్‌రావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్యల బలోపేతానికి కృషి
మిర్యాలగూడ : మహిళా సమాఖ్యల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూ పట్టణంలో మహిళా సమాఖ్యల సభ్యులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తోందన్నారు. వాటిల్లో త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తడకమళ్లలో బంకు ఏర్పాటు స్థలం పరిశీలన చేశామన్నారు. ప్రతి మండల సమాఖ్యకు ఒక ఆర్టీసీ బస్సు కేటాయించడగా జిల్లాలో 30 బస్సులు నడుస్తున్నాయన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళా శక్తి పథకం కింద అమలు చేసే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శేషగిరిశర్మ, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవరావు, ఎంపీఓ రమేష్, ఏపీఎం దిలీప్‌కుమార్, ఏపీఓ సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘ప్రజాబాట’
చిట్యాల : గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా విద్యుత్ శాఖ రూరల్ సీఈ బాలస్వామి, ఎస్‌ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజాబాట కార్యక్రమంలో అధికారులు గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రజలు తెలిపిన సమస్యలను కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ డీఈ విద్యాసాగర్, నల్లగొండ రూరల్ సబ్–డివిజన్ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ రవీందర్‌రెడ్డి, వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


