మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిస్థితి ఇదీ..
మొత్తం చెరువులు 1629
0–25 శాతం నీరున్నవి 1025
25 – 50 శాతం నీరున్నవి 370
50 – 75 శాతం నీరున్నవి 142
75 – 100 శాతం నీరున్నవి 92
సాగర్ జలాశయంలో తగ్గిన నీటిమట్టం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పంటల సాగుకు చుక్క నీరు ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీరు, నదుల ద్వారా వచ్చే కొద్ది పాటి నీరు తాగునీటికే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. నాగార్జునసాగర్‌తోపాటు ఇతర రిజర్వాయర్లలో ఉన్న నీటిని కేవలం తాగునీటికే వినియోగించాలని చెప్పేసింది. ఆకాశంలో మబ్బులు చూసి, వర్షాలు పడతాయన్న ఆశతో రైతులు పంటలు సాగుచేయవద్దని వెల్లడించింది. సూపర్ ఎల్‌నినో రూపంలో మరింతగా కరువు పరిస్థితులు ముంచుకువస్తున్నాయని, వర్షాధారంగానైనా.. రిజర్వాయర్ల కింద సాగుపై ఆశలు పెట్టుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ నీటిపారుదల శాఖ కింద నల్లగొండ జిల్లాలో 10,27,783 ఎకరాల ఆయకట్టు ఉంది. యాదాద్రి జిల్లాలో 3,38,836 ఎకరాల ఆయకట్టు ఉండగా, సూర్యాపేట జిల్లాలో 5,08,480 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా భూములకు రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా ఈసారి సాగునీటిని ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్ల కింద కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేదని, ఇంకోవైపు భూగర్భ జలాలు అడిగంటిన నేపథ్యంలో పంటల సాగు ఇబ్బందిగా మారనుందని స్పష్టం చేసింది.
వచ్చే నెలలో సూపర్ ఎల్‌నినో ప్రమాదం
వచ్చే నెలలో సూపర్ ఎల్‌నినో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలోని ఉన్న అన్ని రిజర్వాయర్లలో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూనన్ వరకు నీటిని తాగునీటి అవసరాల కోసమే నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న నీటిని తాగునీటి కోసం, పశువుల కోసం వినియోగించాలని, పంటల కోసం ఏ ప్రాజెక్టు నుంచి కూడా నీరు వదలడం జరగదని పేర్కొంది. అయితే డిండి ప్రాజెక్టు కింద మిషనన్ భగీరథ నీటి సరఫరా లేనందున పాత డిండి ప్రాజెక్టు కింద మాత్రం 12,875 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటికి కోసం 40 టీఎంసీల నీరు అవసరం.
జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లోని నీరు కేవలం తాగునీటి కోసమే ఉపయోగిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిండి మినహా మిగతా రిజర్వాయర్లలో నీటిని సాగునీటికి ఇవ్వడం కుదరదు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు అవే నీరు అవసరం అవుతాయి. ఒకవేళ ఎవరైనా రైతులు ప్రాజక్టుల కింద పంటలు వేసుకొని ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. రిజర్వాయర్ల నుంచి పంటలకు మాత్రం సాగునీరు వదిలిపెట్టడం కుదరదు. – శ్రీనివాస్‌రెడ్డి,
జిల్లా నీటి పారుదల శాఖ సీఈ
ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీలలో)
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ప్రస్తుతం నిల్వ
నాగార్జునసాగర్ 312.05 163.880
ఏకేబీఆర్ 1.50 1.178
ఉదయసముద్రం 1.525 0.644
పెండ్లిపాకల 0.514 0.082
పెద్దదేవులపల్లి 0.848 0.342
డిండి 2.46 1.169
ప్రకటించిన ప్రభుత్వం
ఫ ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో
ఫ వచ్చే నెలలో మరింతగా దుర్భర పరిస్థితులు
ఫ 2027 జూన్ వరకు తాగునీటికే.. రిజర్వాయర్లలోని నీరు
ఫ వర్షాలపై ఆశతో పంటలు సాగు చేయొద్దన్న ప్రభుత్వం


