నల్లగొండ : జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా మంగళవారం నల్లగొండ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై మెడికల్ కాలేజీలు, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ప్రతి పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి చట్టప్రకారం జరిమానాలు విధించాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణం కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్


