Telangana News: ఇప్పుడు మీ పాత్రే చాలా కీలకం.. కలెక్టర్‌..!
Sakshi News home page

ఇప్పుడు మీ పాత్రే చాలా కీలకం.. కలెక్టర్‌..!

Published Wed, Nov 15 2023 1:34 AM

- - Sakshi

నల్లగొండ: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు అవినాష్‌ చంపావత్‌, ఆర్‌.కన్నన్‌, కె.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో వారు మాట్లాడారు.

పోలింగ్‌ విధానాన్ని పరిశీలిస్తూ తప్పిదాలు, కోడ్‌ ఉల్లంఘనలు జరిగితే వెంటనే రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తేవాలన్నారు. అభ్యర్థికి ఒక పోలింగ్‌ ఏజెంట్‌ మాత్రమే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.

పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ విధానాన్ని, ఈవీఎం వీవీప్యాట్‌లను ఉపయోగించే విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయింపు
నియోజవర్గాల వారీగా వివిధ పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓలు), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓలు), ఓపీఓలు బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ ఆదేశించారు.

మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన రెండో ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల వారీగా విధులు కేటాయించారు.

Advertisement
Advertisement