నేటి నుంచి న్యాయసేవా వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి న్యాయసేవా వారోత్సవాలు

Published Thu, Nov 9 2023 1:44 AM

వివరాలు తెలుసుకుంటున్న ముత్యంరెడ్డి
 - Sakshi

రామగిరి(నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి, జడ్జి బి.దీప్తి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కోర్టులోని ఆ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా న్యాయ చట్టాలపై అవగాహన, న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జైళ్లలో ఖైదీలకు, పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కుటుంబ వివాదాలకు సంబంధించి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఎన్‌.భీమార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

పుట్టంగండి పంప్‌హౌస్‌ పరిశీలన

పెద్దఅడిశర్లపల్లి: ఏఎమ్మార్పీలో భాగమైన మండల పరిధిలోని పుట్టంగండి పంప్‌హౌస్‌ను బుధవారం జెన్‌కో విజిలెన్స్‌ ఎస్పీ ముత్యంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్టంగండి పంప్‌హౌస్‌తో పాటు సిస్టర్న్‌, మోటార్ల పనితీరును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట జెన్‌కో విజిలెన్స్‌ సీఐ కర్ణాకర్‌, డీఈలు నరేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సుధాకర్‌, సత్యనారాయణ, వేణు, యాకోబు ఉన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

చండూరు, మాడ్గులపల్లి: రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యం కొనాలని డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ కాళిందిని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం డీఎస్‌ఓ.. సివిల్‌ సప్లయ్‌ డీఎం నాగేశ్వర్‌రావుతో కలిసి చండూరులో, డీఆర్‌డీఓ మాడ్గులపల్లి మండలంలోని ఆగా మోత్కూర్‌, చిరుమర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి వెంట అసిస్టెంట్‌రిజిస్ట్రార్‌ మహమూద్‌అలీ, ఏఈఓ శ్రీలేఖ, కేంద్రం ఇన్‌చార్జి ఫణి, ఏపీఏం నిజామొద్దీన్‌, నాగయ్య ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి

దేవరకొండ: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండ ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా క్షేత్రప్రచార అధికారి కోటేశ్వర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఎంపీడీఓ శర్మ, కమిషనర్‌ వెంకటయ్య, అరుణ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రామరాజు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పశువులకు

టీకాలు వేయించాలి

కట్టంగూర్‌: పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని జిల్లా పశుగణాభివృద్ధి కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలో జాతీయ కృత్రిమ గర్భధారణ పథకంలో పుట్టిన లేగదూడలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దూడ పుట్టిన 15 రోజుల లోపు నట్టల నివారణ మందు తాపించాలని సూచించారు. కార్యక్రమంలో శేఖర్‌రెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్‌ యాపాల శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌, చెరుకు శ్రీనివాస్‌ ఉన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి దీప్తి
1/2

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి దీప్తి

చండూరులో ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ
2/2

చండూరులో ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ

Advertisement

తప్పక చదవండి

Advertisement