చారకొండ: ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేసే డిండి లిఫ్టు ఇరిగేషన్‌ను రద్దు చేయాలని, రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పాలమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి కన్వీనర్ అశోక్‌గౌడ్ అన్నారు. శనివారం చారకొండలో ప్రధాన రహదారిపై డీఎల్‌ఐ రద్దు కోరుతూ పండుగ సాయన్న స్ఫూర్తితో లక్ష సంతకాల మహోద్యమ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మండలంలోని రైతులు, మేధావులు, యువకులతో సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేయవద్దు అని, వెంటనే డీఎల్‌ఐని రద్దు చేయాలని కోరారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డించారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్‌యాదవ్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో భోజనాన్ని తనిఖీ చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఏబీవీపీ చూస్తూ ఊరుకోదని, మధ్యాహ్న భోజనం పథకంలో ఎలాంటి సమస్య తలెత్తిన ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నగర కార్యదర్శి వసంత చరణ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం తమ బాధ్యత అని, నాణ్యమైన విద్య, పోషక ఆహారం విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి శివరాం, భరద్వాజ్, నర్సింహ, శివ, రామ్‌చరణ్, శివచరణ్, పవన్‌చారి తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా–డీ, లా పరీక్ష ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ఫార్మా–డీ, లా కళాశాల పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్ శనివారం విడుదల చేశారు. ఫార్మా–డీ మొదటి సంవత్సరం పరీక్షలకు 29 మందికి గాను 17 మంది, రెండో సంవత్సరం 51 మందికి గాను 46 మంది హాజరయ్యారు. ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆరో సెమిస్టర్ పరీక్షలకు 29 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ భూమయ్య, ఈశ్వర్‌కుమార్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


