ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

Nov 12 2026 1:07 AM | Updated on Nov 12 2026 1:07 AM

గ్రామీణ ఆర్థికి ప్రగతికి కొత్త బాట..

కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి.. మెరుగైన విద్య అందిస్తున్నట్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ మండలం దేశిటిక్యాలలో ఎంపీ నిధులతో నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యారంగం బలోపేతానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం దేశిటిక్యాలలో రూ. 3.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ తీగల సునేంద్ర పాల్గొన్నారు.

తాడూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకింగ్‌ సేవలు కీలకమని.. ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా నూతన బ్యాంకు ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమని ఎంపీ మల్లు రవి అన్నారు. తాడూరు మండలం మేడిపూరులో నూతనంగా ఏర్నాటుచేసిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖను స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ప్రజల ఆర్థికి స్వావలంబనకు బ్యాంకింగ్‌ సదుపాయాలు దోహదపడతాయన్నారు. మేడిపూర్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఏర్పాటుతో సమీప తొమ్మిది గ్రామాల ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచ్‌ మల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ రామచంద్రారెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement