ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Nov 12 2026 1:07 AM | Updated on Nov 12 2026 1:07 AM

కోడేరు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కోడేరు మండలంలోని కొండ్రావుపల్లి, నాగులపల్లి తండా, రేకులపల్లి తండా, మైలారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విడుతల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఏ ఒక్కరికీ కూడా ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రేషన్‌ దుకాణాల్లో ఉచితంగా సన్నబియ్యం, రూ.500కు సిలిండర్‌ తదితర పథకాలు అందిస్తున్నామన్నారు. తాము చేస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, హౌసింగ్‌ ఏఈ నాగరాజు, సర్పంచ్‌ కొమ్ము కుర్మయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement