మహబూబ్‌నగర్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను గడువులోగా పూర్తి చేసి అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తేవాలి. ప్రస్తుతం ఈ పనులు కొన్ని నెలలుగా జరుగుతున్నందున ప్రయాణికుల రాకపోకలకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతా గజిబిజిగా ఉండటంతో ఎక్కాల్సిన రైలు కోసం సంబంధిత ప్లాట్ఫారం వరకు సకాలంలో వెళ్లడం ఎలా అని ప్రయాణికులు వాపోతున్నారు.
– డి.గోపాల్ నారాయణ, డీఆర్‌యూసీసీ సభ్యుడు, హైదరాబాద్ డివిజన్, షాద్‌నగర్
●


