మరో అవకాశం.. | - | Sakshi
Sakshi News home page

మరో అవకాశం..

Nov 10 2026 1:01 AM | Updated on Nov 10 2026 1:01 AM

వారి కోసమే ఈ ప్రక్రియ..

ఓటుహక్కు కోల్పోయిన వారికి ఎన్నికల కమిషన్‌ సదావకాశం

ఎవరిని సంప్రదించాలి..

● చిరునామా మారిన వారికి మార్గం సుగమం

● ఫారం–8 అవసరం లేకుండానే ప్రక్రియ

● ఈ నెల 21 వరకు దరఖాస్తుల

సమర్పణకు గడువు

● ఏఎస్‌డీడీ జాబితా ఓటర్లకు ఊరట

ఏఎస్‌డీడీ జాబితాలో నమోదైన ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి. గతంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు జారీ చేసినప్పటికీ పలు కారణాలతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారి కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నాం. ఓటు హక్కు పొందాలనుకునే వారు వెంటనే సంబంధిత బీఎల్‌ఓ, ఏఈఆర్వో, ఈఆర్వోలను సంప్రదించి అవసరమైన ఎన్యుమరేషన్‌ డాక్యుమెంట్లు సమర్పించాలి.

– హేమంత కేశవ్‌ పాటిల్‌,

కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌

అచ్చంపేట: ఓటరు జాబితాలో పేరు లేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)– 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి పేర్లు గల్లంతైన, చిరునామా మారిన ఓటర్లకు ఎన్నికల సంఘం (ఈసీ) మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే ప్రచురించిన సర్‌ ముసాయిదా జాబితాలో ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌, డూప్లికేట్‌ (ఏఎస్‌డీడీ) కారణాలతో పేర్లు తొలగిపునకు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాలో చేరుస్తామని ఈసీ ప్రకటించింది. గత ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4,63,155 మంది ఏఎస్‌డీడీ (గైర్హాజరు, చిరునామా మార్పు, మృతి చెందిన, డూప్లికేట్‌) కేటగిరీలో ఉండగా.. వారిలో అత్యధికంగా 2,41,883 మంది శాశ్వత చిరునామా మారినవారే. వీరు తిరిగి ఓటరు జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రక్రియను సులభతరం చేశారు. మరణించిన వారు 88,198, అన్‌కలెక్టబుల్‌/ ఆబ్సెంట్‌ 50,828, ఇతరులు 3,723, చిరునామా మార్పు కోసం 78,477 మంది ఉన్నారు. చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫారం–8 సమర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారాన్ని సమర్పిస్తూ ఎన్యూమరేషన్‌ ఫారంలో వివరాలు నమోదు చేయవచ్చు. కొత్త చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటుతో చిరునామా మారినవారు తిరిగి ఓటర్ల జాబితాలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి వారు ఈ నెల 21లోగా సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఫారం తప్పనిసరి కాదు..

సాధారంగా ఓటరు జాబితాలో పేరు గల్లంతైతే మళ్లీ కొత్తగా చేరేందుకు ఫారం–6 సమర్పించడం తప్పనిసరి. అయితే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో గైర్జాజర్‌,చిరునామా అందుబాటులో లేకపోవడం, మరణం, నకిలీ నమోదులు తదితర సాంకేతిక కారణాలతో పేర్లు కోల్పోయిన వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం నిబంధనలను సడలించింది. ఇకపై అర్హులైన ఓటర్లు ఫారం–6 సమర్పించాల్సిన పనిలేదు. సంబంధిత ఎన్యుమరేషన్‌ పత్రంతోపాటు అవసరమైన స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించారు.

గతంలో ఎన్యుమరేషన్‌ ఫారాలు జారీ చేసినప్పటికీ పలు కారణాలతో ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారి కోసం ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో అందుబాటులో లేనివారు, నివాసం మారినవారు, మరణించినట్లు తప్పుగా నమోదైనవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేవని, సంబంధిత పౌరులు వెంటనే తమ వివరాలను ముసాయిదా జాబితాలో సరిచేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటు హక్కు కోల్పోయిన పౌరులు బూత్‌ లెవెల్‌ అధికారి, ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయక ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించవచ్చు. వీరికి అవసరమైన పత్రాలను అందజేసి జాబితాలో పేరును పునరుద్ధరించుకోవచ్చు. ఇప్పటికే ఎన్యుమరేషన్‌ పత్రం సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నివాసం లేదా చిరునామా మారిన ఓటరు తమ కొత్త చిరునామాతోపాటు శాసనసభ నియోజకవర్గ సమాచారాన్ని స్పష్టంగా జతచేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement