పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

Nov 6 2026 1:56 AM | Updated on Nov 6 2026 1:56 AM

కొల్లాపూర్‌ రూరల్‌: పేదవారికి అండగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పరిపాలన ప్రభుత్వం కొనసాగుతుందని, పేదల సంక్షేమం, వారి సొంతింటి కల నెరవేర్చడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గురువారం మండలంలోని బోడబండతండా, లచ్చనాయక్‌తండా, వడ్డెర గుడిసెలులో మంత్రి జూపల్లి పర్యటించి పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. అలాగే లచ్చనాయక్‌తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నార్లాపూర్‌లో మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతి పేదవారికి మేలు జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రామన్‌గౌడ్‌, బామినీ, రాములునాయక్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంతునాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకులు బాలునాయక్‌, రహీంపాషా, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement