చి ‘వరి’ ప్రయత్నం.. | - | Sakshi
Sakshi News home page

చి ‘వరి’ ప్రయత్నం..

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

ఎల్‌నినో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. బోరుబావుల్లో నీటిమట్టం అడుగంటడం, కాల్వల ద్వారా సాగునీరు అందక సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పాన్‌గల్‌ మండలం బండపల్లికి చెందిన శేషయ్య 1.20 ఎకరాల్లో వరి సాగు చేశారు. భీమా 27వ ప్యాకేజీకి సాగునీరు నిలిచిపోవడం, విద్యుత్‌ కోతలతో బోరుమోటారు నుంచి సరిపడా నీరందడం కష్టంగా మారింది. దీంతో చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్‌ను అద్దెకు తీసుకొని ట్రిప్పునకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తూ కేఎల్‌ఐ నీటిని

నింపుకొని పొలానికి అందిస్తున్నారు.

– పాన్‌గల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement