జోరుగా బెల్టు దందా! | - | Sakshi
Sakshi News home page

జోరుగా బెల్టు దందా!

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

అధికారికంగా 36 దుకాణాలే..

వనపర్తి: జిల్లాలో మద్యం విక్రయాల విషయంలో ఎకై ్సజ్‌శాఖ పట్టు కోల్పోతోంది. ఐదు పురపాలికలు, 15 మండలాల పరిధిలో 36 మద్యం దుకాణాలు,, ఎనిమిది బార్లు అధికారంగా కొనసాగుతున్నాయి. కానీ జనావాస ప్రాంతాల్లోనూ నిరంతరం మద్యం లభించేలా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. నీటి సీసాలు లభించని గ్రామాలు ఉండొచ్చుగాని.. మందు దొరకని ప్రాంతాలు లేవంటే నమ్మాల్సిందే. ప్రభుత్వం మద్యం విక్రయాలపై సీజన్లు, పండుగలు తదితరాల పేరిట ఎకై ్సజ్‌ అధికారులకు లక్ష్యాలు విధించడంతో వారు బెల్టు దుకాణాల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఈ దుకాణాల నిర్వహణకు స్థానికంగా అనధికార వేలం పాటలు నిర్వహిస్తున్నారనేందుకు ఇటీవల రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం, స్వగ్రామం సమీపంలోని గ్రామంలోనే.. బహిరంగ వేలం నిర్వహించారు. ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ.. చిన్నంబావి మండలానికి చెందిన పలువురు ఎకై ్సజ్‌శాఖ ఈఎస్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. వేలం పాటలు వెలుగుచూసింది ఒకటి, రెండు ఉంటుండగా.. గ్రామస్తులు అభివృద్ధి పనుల పేరిట రహస్యంగా వేలం పాటలు నిర్వహించుకొని బెల్టు షాపుల ఏర్పాటుకు ఊతమిస్తుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా భారీ మొత్తాలకు అనధికార ఒప్పందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నగదు లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి? ఎవరి అండదండలతో విక్రయాలు సాగుతున్నాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు కోరుతున్నారు. ఎకై ్సజ్‌శాఖ మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు మద్యం అక్రమ విక్రయాలు, నిల్వలు, సరఫరాను అడ్డుకోవడం కూడా కీలక బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో సంబంధితశాఖ విధులు అందుకు విరుద్ధంగా నిర్వహిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎకై ్సజ్‌శాఖ మంత్రి ఇలాకాలోనూ బెల్టు షాపులు జోరుగా నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రి ఇలాకాలో వేలం పాటలతో అక్రమ మద్యం దుకాణాల కేటాయింపు

ఇటీవల వెలుగులోకి వచ్చిన

బెక్కెం వేలం ఉదంతం

పల్లె, పట్టణం, తండా తేడా లేకుండా వ్యాపారం

‘టార్గెట్ల’ కోసం చూసీచూడనట్లు

వ్యవహరిస్తున్న ఎకై ్సజ్‌శాఖ

మద్యం దుకాణాల నిర్వాహకుల హస్తంతోనేనా..?

జిల్లాలో 2025–27 కాలానికి అధికారిక మద్యం విక్రయాలను లక్కీడిప్‌ పద్ధతిన 36 దుకాణాలు, శాశ్వతంగా నిర్వహించే బార్లు ఎనిమిదింటికే అనుమతి ఉంది. కానీ వేల సంఖ్యలో అక్రమ మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్‌ను రూపొందించినట్లుగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ఎకై ్సజ్‌శాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement