కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: చెంచు కుటుంబాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పునరావస కాలనీలో సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారంలో రూ.4.50 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులకు శనివారం వారు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
రూ.15.87 కోట్లతో..
పెద్దకొత్తపల్లి మండలంలోని బండరావిపాకుల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జెడ్పీ రోడ్డు వరకు నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా 6.95 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.5.7 కోట్లు, పాన్‌గల్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బండపల్లి మీదుగా జమ్మాపూర్ వరకు 4.40 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.3.60 కోట్లు, వీపనగండ్ల మండలం కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట–బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.6.56 కోట్లతో చేపట్టనున్నారు. పెంట్లవెల్లి పీడబ్ల్యూడీ రోడ్ సింగోటం, చింతలపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల వరకు నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు, మాచినేనిపల్లి శివారులో 5.68 కోట్ల వ్యయంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్‌ప్లాంట్ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.175 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేంత్‌చంద్ర, ఎఫ్‌డీఓ చంద్రప్రకాశ్ సింగల్, అదనపు కలెక్టర్ దేవసహయం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణం ఇవ్వడంపై
ఓర్వలేకపోతున్నారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తే మహిళలు చెడిపోతున్నారంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, మహిళలను ఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
త్వరలో ‘ప్రభాతభేరి’
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు
కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని, ఇందుకు కొండా సురేఖ, చిన్నారెడ్డి ఉదంతాలే నిదర్శనమని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అన్నారు. సురేఖ, చిన్నారెడ్డి అంశంలో తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారికి నోటీసులు ఇచ్చాం. వివరణలు తీసుకున్నాం. వాటిపై పీసీసీ, క్రమశిక్షణ నివేదికలు ఏఐసీసీకి అందజేశాం. తర్వాతే వారిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. సభలో జూపల్లి అరుణ్, ఇందిరా శోభన్, హన్మంతునాయక్, కళ్యాణ్‌రావు, విద్యాసాగర్‌రావు, రెడ్డి జ్యోతిసత్యం, షేక్ రహీంపాష, పసుపుల నర్సింహ, దండు నర్సింహ తదితరులు ఉన్నారు.
బాచారంలో చెంకు కుటుంబాల పునరావాసం నిర్మాణాలకు భూమిపూజ
మహిళలకు రూ.175 కోట్ల రుణాల చెక్కులు అందజేత
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు


