అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భరత్‌గౌడ్ కృషితో గతంలో 25 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 39 మంది చదువుకుంటున్నారు. డ్రాపౌట్ ఎక్కువ ఉన్న ఈ పాఠశాలలో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషిచేశారు. తెలుగు మీడియం అయినప్పటికీ విద్యార్థులకు ఆంగ్ల బోధన చేస్తుండటంతో కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తున్న తమ పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించారు. అలాగే పాఠశాల నిధులతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడమే కాకుండా గోడలపై తెలుగు, ఆంగ్లం పదాలు రాయించారు.


