ఆహ్లాదకర వాతావరణంలో.. | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదకర వాతావరణంలో..

Sep 5 2026 6:31 AM | Updated on Sep 5 2026 6:31 AM

దాతల సహకారంతో...

తెలకపల్లి మండలంలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలకు 2024లో బదిలీలో భాగంగా హెచ్‌ఎం మల్లేష్‌ వచ్చినప్పుడు 38 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. గ్రామస్తుల సహకారంతో ఏటా విద్యార్థుల పెంచుతున్నారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ.. పాఠశాల విద్యార్థుల గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గ్రామస్తులు రూ.50 వేలు, తన సొంత డబ్బులు రూ.48 వేలతో పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలు, బోధనోపకరణాలకు వెచ్చించారు. ప్రస్తుతం పాఠశాలలో ముగ్గురు టీచర్లు, 66 మంది విద్యార్థులు.. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల కొనసాగుతోంది.

ఐతోల్‌ ప్రాథమిక పాఠశాల

శిథిలావస్థలో ఉన్న బడిని తన ఆలోచన, గ్రామపెద్దలు కంకణాల కృష్ణారెడ్డి, వారి సోదరులు, అందుగుల నాగేందర్‌రావు, వీరారెడ్డి, రమేష్‌గౌడ్‌ సహకారంతో రూ.25 లక్షలు వెచ్చించి నూతన పాఠశాలగా తీర్చిదిద్దారు తాడూరు మండలంలోని ఐతోల్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వీరేష్‌. తాను పాఠశాలకు వచ్చినప్పుడు 22 మంది విద్యార్థులతో కొనసాగిన బడిని ప్రస్తుతం 44 మందితో విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ వారిని తన ఆలోచనకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ.. ప్రసంశలు అందుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement