మారిన వాతావరణ పరిస్థితులతో మంచం పడుతున్న ప్రజలు
నిర్లక్ష్యం చేయొద్దు..
అచ్చంపేట: జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికితోడు పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి.. ఎక్కడికక్కడ మురుగు నిలిచి.. ఈగలు, దోమలు అధికమై జనాన్ని ఆస్పత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇది పెద్ద ప్రమాదమేమి కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ ఎక్కువగా.. ఐపీ తక్కువగా ఉంటోంది. మందులతోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని, నిర్లక్ష్యం చేసిన వారు ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
వారం, పదిరోజులపాటు..
జలుబు, దగ్గుతో మొదలై వైరల్ ఫీవర్లుగా మారుతున్నాయి. సాధారంగా బాధితులకు తీవ్రమైన జ్వరంతోపాటు నొప్పులు, అలసట, బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారం, పది రోజులకు కానీ ఆరోగ్యం కుదుటపడటం లేదు. అయితే సరైన నిర్ధారణ లేకుండా చికిత్స తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ, పల్లెలు, పట్టణాల్లో మాత్రం కొందరు ఆర్‌ఎంపీలు అర్హతకు మించి డెంగీ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. డెంగీకి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ఔషధం లేదు. ఆర్‌ఎంపీలు మాత్రం అధిక డోస్ యాంటీ బయోటిక్స్ వినియోగిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రి సహా జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్లతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్ ఫీవర్, ఫ్లూ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కేసులూ నమోదవుతున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జ్వర పీడితులు ఎక్కువగా స్థానిక వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నిర్ధారణ కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్‌లు ఏర్పాటు చేసి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్‌లు, మెడికల్ దుకాణాల్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు ప్రమాదరకరమైన యాంటీ బయాటిక్ ఇంజెక్షన్, సైలెన్లు ఎక్కిస్తూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. రక్త పరీక్షలతోపాటు స్కానింగ్‌ల పేరిట రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. రక్తకణాలు కాస్త తక్కువగా ఉన్నా.. అడ్మిట్ కావాలని సూచిస్తూ.. మూడు, నాలుగైదు రోజులు చికిత్స అందించి రూ.20–30 వేలకు పైగా బిల్లు వేస్తున్నారు. జ్వరం వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తికి రోజుకు రూ.2–4 వేలకు పైగానే ఖర్చు అవుతుండగా.. ఇందులో మందులు అదనం. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు కోరుతుండగా.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు శూన్యంగా ఉన్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
అధిష్టానానికి ఫిర్యాదుతో..
చిన్నారెడ్డి వ్యాఖ్యలను మేఘారెడ్డి ఖండించడంతోపాటు తాను డబ్బులు ఎవరికిచ్చి సీటు తెచ్చుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. దీనిపై టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీ, సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం చర్యలకు సిఫార్సు చేయడం.. సీరియస్‌గా పరిగణించిన పార్టీ అధిష్టానం సుమారు రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జలుబు, దగ్గు, గొంతునొప్పి,
జ్వరంతో ఇబ్బందులు
ఓపీలో పెరుగుతున్న రోగులు..
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
టెస్టుల పేరుతో దండుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు
మరోవైపు స్థాయికి మించి వైద్యంతో ఆర్‌ఎంపీల చెలగాటం
వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరం ముదిరితే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ అయ్యి.. ఇతర వ్యాధులకు దారి తీసి ప్రాణాంతకం కావొచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి.. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. 24 గంటలపాటు వైద్యులు, ఓపీ, ఐపీ, మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ అమ్రీన్,
సివిల్ అసిస్టెట్ సర్జన్, అచ్చంపేట


