ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

కందనూలు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజు బకాయిల పేరుతో కొన్ని కళాశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి శివ, తిమ్మాజిపేట మండల కన్వీనర్‌ వెంకటేశ్‌, మల్లేష్‌, జీవన్‌, మార్కండేయ, జగన్‌, జ్ఞానేశ్వర్‌, లోకేష్‌, కీర్తన, కృష్ణవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement