కందనూలు: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకు దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
జిల్లాలో
గెజిటెడ్,
నాన్ గెజిటెడ్
ఉద్యోగులు
ఉపాధ్యాయులు
పెన్షనర్లు
సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా ఆందోళన
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి
నేడు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదంటున్న ఉద్యోగులు
ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి.
పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ ఈహెచ్‌ఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి.
సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి.
రెండవ పీఆర్సీని తక్షణమే అమలు
చేయాలి.
పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసేందుకు ప్రతినెలా రూ. 2వేల కోట్లు విడుదల చేసి, ఉద్యోగుల బకాయిలను త్వరగా చెల్లించాలి.
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు..
ఇటీవల పలుమార్లు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర జేఏసీ బాధ్యులు సీఎం, డిప్యూటి సీఎంతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడం, స్పష్టమైన హామీలు రాకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అందులో భాగంగా పలు దఫాలుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
4,625


