అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Sep 1 2026 1:25 AM | Updated on Sep 1 2026 1:25 AM

తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తిమ్మాజిపేట రైతువేదికలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు అందక పేదలు అవస్థలు పడ్డారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఇస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సొంతిల్లు లేని పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండో విడత గుడిసెలు, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లల్లో నివాసమున్న పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుద్ధసముద్రంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేరళ్లపల్లి, మరికల్‌లో పలువురిని పరామర్శించి.. రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జయంతి, ఎంపీడీఓ శ్రీహరి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వివేక్‌రెడ్డి, నాయ కులు వెంకట్రామారెడ్డి, మల్లయ్యగౌడ్‌, నాగ సాయిలు, శ్రీనివాస్‌ బహదూర్‌, రవూఫ్‌, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారా యణ, మాధవ్‌, గిరిజ, వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement