ప్రజా సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే లక్ష్యం

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

అచ్చంపేట రూరల్‌: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఐనోల్‌ గ్రామంలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న విద్య, వసతులు, భోజనం ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి అల్ఫాహారం తీసుకున్నారు.

మత్తు.. భవిష్యత్‌కు

గొడ్డలి పెట్టు

కల్వకుర్తి రూరల్‌: మత్తు పదార్థాలు యువత భవిష్యత్‌కు గొడ్డలి పెట్టువంటివని.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఆదివారం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలు వినియోగించకుండా చైతన్యం చేసేందుకు నిర్వహించిన 2కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి సమాజంలోని ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. మరింత మంది ముందుకొచ్చి.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2కె రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బంగి రత్నమాల ఆనంద్‌కుమార్‌, మాజీ చైర్మన్‌ ఎడ్మ సత్యం, సంజీవ్‌ యాదవ్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, పసుల రమాకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, శ్రీకాంత్‌ రెడ్డి, పుస్తకాల రాహుల్‌, ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ సభ్యుడు బాలస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement