కందనూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చిన్నునాయక్ (హెడ్‌కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌ను నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలవగా.. ఆయన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పోలీస్ అసోసియేషన్ అనేది కేవలం ఒక సంఘం మాత్రమే కాదని, అది పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవానిరతిని మరింత బలోపేతం చేసే కీలక వేదిక అన్నారు. పోలీస్ శాఖలోని ప్రతిఒక్కరి సమస్యల పరిష్కారం, సంక్షేమానికి నూతన కార్యవర్గం బాధ్యతాయుతంగా కృషి చేయాలని, విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి అధికారులు, సిబ్బందికి మధ్య వారదిగా ఉంటూ ముందుకు సాగాలని సూచించారు.
ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి (సీఐ), రాములు (ఎస్‌ఐ), కార్యదర్శిగా మాధవరెడ్డి(ఎస్‌ఐ), సహ కార్యదర్శిగా రమేష్, కార్య నిర్వాహక కార్యదర్శిగా రాములు, కోశాధికారిగా శ్రీనివాసులు, సభ్యులుగా రవివర్మ, నాగరాజు, శారద, శ్రీనయ్య, కిషోర్‌రెడ్డి, హరిలాల్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శంకర్, ఏఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


