కందనూలు: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జామ మసీదు నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. జామియా నిజామియా అరబీ యూనివర్సిటీకి చెందిన మౌలానా ముఫ్తీ మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఖాద్రి, ఖతీబ్ ముఫ్తీ గుల్జార్ అహ్మద్ మిస్బాహి మహమ్మద్ ఆధ్యాత్మిక బోధన చేశారు. ప్రతి ముస్లిం అల్లా సూచించిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, ఫిక్రే రజా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.


