నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌

Aug 27 2026 1:06 AM | Updated on Aug 27 2026 1:06 AM

కొల్లాపూర్‌ రూరల్‌: పోలీసు ఉద్యోగాల సాధనకు సన్నద్ధమవుతున్న కొల్లాపూర్‌ నియోజకవర్గ యువతకు రత్నగిరి ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులకు మెరుగైన శిక్షణ అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కొల్లాపూర్‌ మినీ స్టేడియంలో వంద రోజులపాటు ఉచిత శిక్షణ కొనసాగుతుందని.. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, శిక్షణ ప్రారంభ తేది, ఇతర పూర్తి వివరాలను త్వరలో రత్నగిరి ఫౌండేషన్‌ కన్వీనర్‌ కేతూరి ధర్మతేజ వెల్లడిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు హనుమంత్‌, కౌన్సిలర్లు బోరెల్లి మహేశ్‌, నర్సింహ, కర్నె శివ, పసుపుల నర్సింహ, రాజశేఖర్‌గౌడ్‌, వేణుగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement