నేత్రదానంపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

నేత్రదానంపై అవగాహన అవసరం

Aug 26 2026 1:18 AM | Updated on Aug 26 2026 1:18 AM

కందనూలు: నేత్రదానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ఒకరి నేత్రదానంతో ఇద్దరికి చూపు వస్తుందని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. మంగళవారం బిజినేపల్లి మండలంలోని పాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో 41వ నేత్రదా న పక్షోత్సవాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయి ంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేత్రదా నం ప్రతి కుటుంబం సంప్రదాయంగా మార్చుకో వాలని, అంధులకు చూపునివ్వాలని కోరారు. కంటిలో కార్నియా ఇన్‌ఫెక్షన్‌, దెబ్బల వలన, కంట్లో రసాయన పడటం వల్ల, పోషక విలువలు లోపించడం వలన కార్నియా స్వచ్ఛత కోల్పోవడం ద్వారా అంధత్వానికి దారితీస్తుందన్నారు. ఎవరైనా మర ణించిన తర్వాత తమ నేత్రాలను 6 గంటలలోపు దానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భరత్‌కుమార్‌రెడ్డి, వైద్యాధికారి ప్రియాంక, సర్పంచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement