గ్రీవెన్స్‌కు 2 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌కు 2 అర్జీలు

Aug 25 2026 1:15 AM | Updated on Aug 25 2026 1:15 AM

కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల నుంచి ఎస్పీ 2 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 1 భూమికి సంబంధించినవి, 1 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చాయన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.

శ్రీశైలంలో తగ్గిననీటిమట్టం

అచ్చంపేట/ ఆత్మకూర్‌: ఎగువనున్న జూరాల జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయానికి 7,134 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 875.70 అడుగుల వద్ద 166.7052 టీఎంసీల నీటిమట్టం ఉంది. అయితే ఆదివారం 168.2670 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు వదులుతుండటంతో 2 టీఎంసీల మేర తగ్గింది. కుడిగట్టు కేంద్రంలో లోడ్‌ డిశ్పాచ్‌ ఆదేశాల మేరకు ఐదురోజుల నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 8 వేల క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ ప్రబుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.

తగ్గిన విద్యుదుత్పత్తి...

ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యానికి

ప్రాజెక్టులు బలి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement