ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలి | - | Sakshi
Sakshi News home page

ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలి

Aug 25 2026 1:15 AM | Updated on Aug 25 2026 1:15 AM

బల్మూర్‌: బల్మూరు శివారులో నిర్మించబోయే ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ తక్షణమే డిజైన్‌ మార్పు చేసి రైతులను ఆదుకోకపోతే బాధిత రైతులను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్‌, నాగరాజు, లాల్‌ అహ్మద్‌, బాబర్‌, శ్రీరామ్‌, శ్రావణ్‌కుమార్‌, కృష్ణయ్య, అంజి, బాలరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement