నాగర్‌కర్నూల్/కందనూలు: ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 910 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని 13,216 మంది ఓటర్లను గుర్తించినట్లు చెప్పా రు. అదే విధంగా ఓటర్లు సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారాల్లో ప్రస్తుతం నమోదైన వారి వివరాలను గత జాబితాతో సరిపోల్చి పరిశీలించినట్లు తెలిపారు. ఈ వివరాల విశ్లేషణలో మరో 1,02,635 మంది ఓటర్లను గుర్తించినట్లు కలెక్టర్ వివరించారు. రెండు విభాగాల్లో గుర్తించిన 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నో టీసులు అందిన ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఓ టర్ల వివరాలను మరింత స్పష్టంగా ధ్రువీకరించేందుకు, అర్హులైన ఓటర్లను నిర్ధారించేందుకు ఈ ప్రక్రి య చేపడుతున్నట్లు వివరించారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అన్నా రు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శా తం మరింత పెంచేందుకు మండల అధికారు లు, పర్యవేక్షణ బృందాలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు అలవడేలా చూడాలన్నారు. పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో జిల్లాకు మెరుగైన స్థానం సాధించేందుకు ప్ర త్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే భవితా కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల గల పిల్లలకు చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ రమేశ్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటాజీ, ఎల్‌డీఎం చంద్రశేఖర్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్ ఉన్నారు.


