తాడూరు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇంద్రకల్‌లో రూ.20 లక్షలతో నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రతిపక్ష నాయకులు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా పాలనపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో పీఆర్‌ఏఈ శివకృష్ణ, మాజీ సర్పంచ్ వెంకటయ్య, చైర్మన్ రాంచంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ రమణరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, సర్పంచ్ మల్లయ్య, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


