డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

కందనూలు: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పోలీసు, ఎకై ్సజ్‌శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్‌ సూచించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్‌పై పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్‌ 12న జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ చేసుకోదగిన క్రిమినల్‌ కేసులు, బ్యాంకు రుణ సంబంధిత కేసులు, చెక్‌బౌన్స్‌, కుటుంబ, భూ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో సుమారు 7,300 పెండింగ్‌ కేసులు ఉన్నాయని.. వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్‌ల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో అలసత్వం వహించరాదన్నారు. బాలలను పనిలో పెట్టుకునే దుకాణాలు, ఏజెన్సీలు, కంపెనీల లైసెన్స్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌బౌన్స్‌ కేసుల పరిష్కారానికి నవంబర్‌ 21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, న్యాయమూర్తులు శ్రుతిదూత, శ్రీనిధి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement