మత్తులో టీనేజర్స్‌..! | - | Sakshi
Sakshi News home page

మత్తులో టీనేజర్స్‌..!

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

నిఘా పెంచాం..

యువకులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు

కేసులు కొన్నే.. ఫిర్యాదులు బోలేడు

● కొల్లాపూర్‌ పట్టణ శివారులోని శ్మశాన వాటిక, బక్కాయిపల్లి చెరువు, అమరగిరి వెళ్లే రోడ్డు, కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద, ఇతర

నిర్మానుష్య ప్రాంతాల్లో కొందరు యువత, విద్యార్థులు నిత్యం గంజాయి

తాగుతున్నారు. ఆరు నెలల క్రితం పోలీసులు

ఒకరిని అదుపులోకి తీసుకుంటే.. 20 మందికి పైగా గంజాయి తాగే వారి పేర్లు బయటకు వచ్చాయి. వారందరినీ స్టేషన్‌కు పిలిచి.. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వీరిలో నలుగురిపై కేసులు నమోదై జైలుకు సైతం వెళ్లారు. అయితే ఇప్పటికీ అక్కడ గంజాయి వినియోగం ఏమాత్రం తగ్గలేదు.

ల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్‌ రాజ్‌, మానసిక వైద్యుడు, జనరల్‌ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా పెంచాం. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి విక్రయించినా, తాగినా కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వారి సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలతో కలిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నాం.

– వెంకటేశ్వర్లు, ఏఎస్పీ

నాగర్‌కర్నూల్‌/పాలమూరు: ‘ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసగా మారుతున్న కొందరు టీనేజర్స్‌, యువకులు.. చివరికి వాటి విక్రేతలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఎకై ్సజ్‌– పోలీసులు చేసిన దాడుల్లో 16 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికంగా పట్టుబడటం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. గంజాయి అధికంగా వినియోగంతో విచక్షణ కోల్పోయి.. పలు నేరాలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మెడికల్‌ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఇతర కళాశాల్లోనే గంజాయి సరఫరా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నా.. మరోవైపు గంజాయి వినియోగం మాత్రం కట్టడి కావడం లేదు. ఒక్కో పాకెట్‌లో 12 గ్రాములు నింపి ప్యాక్‌ చేసి రూ.400–500 విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్‌లో ఉండే పొగాకులో కలిపి తీసుకుంటూ.. ఒక రకమైన మత్తుకు బానిసగా మారుతున్నారు. ఇందుకోసం యువత గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక గదులు, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 16–25 ఏళ్లలోపు వారితోపాటు ఆటోడ్రైవర్లు దీనిని అధికంగా తీసుకుంటున్నారు.

శివారు ప్రాంతాలే అడ్డా

తరుచూ వినియోగంతో

మానసికంగా పలు మార్పులు

సరఫరాలో ప్రముఖంగా మైనర్లతోపాటు 25 ఏళ్లలోపు యువతే..

ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఇదే పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement